లోయలో పడిన ఆర్మీ వాహనం నలుగురు జవాన్లు మృతి
Army vehicle fell into valley killing four soldiers
ఇద్దరికీ తీవ్ర గాయాలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఆర్మీ ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు జవాన్లు మరణించారు. ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. ఈ వాహనంలో ఆరుగురు జవాన్లు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదం ఎస్కే పయీన్ అనేప్రాంతంలో జరిగిందని అధికారులు వివరించారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ లో ఉన్నందున సాయంత్రం వరకూ పూర్తి వివరాలను అందజేస్తామని తెలిపారు.
డిసెంబర్ 24న పూంచ్ జిల్లాలో ఆర్మీ వ్యాన్ 350 అడుగుల లోతైన లోయలో పడగా ఐదుగురు మృతి చెందారు. 11 మందికి గాయాలయ్యాయి.