సంగమంలో స్నానమాచరించిన అంబానీ కుటుంబం
Ambani family bathed in Sangam

లక్నో: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ కుటుంబం ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభమేళాలో మంగళవారం పుణ్య స్నానాలాచరించారు. కుమారుడు అనంత్, కోడలు రాధికా మర్చంట్, తల్లి కోకిలాబెన్ లు మహాకుంభమేళాకు చేరుకొని సంగమంలో స్నానం చేశారు. ప్రయాగ్ రాజ్ లో 30వ రోజు సాయంత్రం 6 గంటల వరకు 1.23 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో 45.85 కోట్లకు స్నానాలాచరించిన వారి సంఖ్య చేరుకుందన్నారు. అంతేగాక సెక్టార్ 17 శక్తిధామ్ లో 68 మంది విదేశీ భక్తులు సనాతన ధర్మాన్ని స్వీకరించారని అధికారులు వివరించారు. కాగా ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ సందర్భంగా పుణ్య స్నానాలాచరించే భక్తులపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించనున్నారు.