20 మందితో ఆప్ రెండో జాబితా విడుదల
AAP's second list with 20 people released
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆప్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికల జాబితా విడుదల చేసింది. సోమవారం విడుదల చేసిన ఈ జాబితాలో 20మందికి చోటు కల్పించింది. అదే సమయంలో 14 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు లభించకపోగా, సిసోడియా ఇంతకుముందు పోటీ చేసిన స్థానం గాకుండా వేరే స్థానాన్ని కేటాయించింది. ఇద్దరు ఎమ్మెల్యేల కుమారులకు టికెట్లను కేటాయించింది.
ఏ ఎమ్మెల్యేల టికెట్లు కట్?
టికెట్ నిరాకరించిన ప్రస్తుత ఎమ్మెల్యేలలో శరద్ చౌహాన్ (నరేలా), దిలీప్ పాండే (తిమర్‌పూర్), పవన్ శర్మ (ఆదర్శ్ నగర్), ధరంపాల్ లక్రా (ముండ్కా), ప్రహ్లాద్ సింగ్ సాహ్ని (చాందినీ చౌక్) ఉన్నారు. చాందినీ చౌక్ అసెంబ్లీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ సింగ్ సాహ్ని కుమారుడు పురందీప్ సింగ్ సాహ్నీకి టికెట్ లభించింది. మనీష్ సిసోడియా, ప్రవీణ్ కుమార్, రాఖీ బిర్లాన్ సీట్లు మారాయి.