విషం చిమ్ముతున్న 86 మంది ఫ్రీలాన్స్ జర్నలిస్టులు
86 freelance journalists who are spewing poison

నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: యూఎస్ ఏఐడీ సమకూరుస్తున్న నిధుల ద్వారా భారత్ పై విషం చిమ్ముతున్న 86 మంది ఫ్రీలాన్స్ జర్నలిస్టులు ఉన్నట్లు ఆరోపణలు, విమర్శలున్నాయి. వీరంతా జార్జ్ సోరెస్ భారతీయ సంస్థ కోసం పనిచేస్తుంటారు. దేశ వ్యతిరేక కథనాలు, విషం చిమ్మే కథనాలు, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను అపహాస్యం చేసే కథనాలను రాస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వీరికి అందుతున్న వేతనం ప్రకారం భారత వ్యతిరేక కథనాలు రాయడంలో వీరు కీలక పాత్ర పోషిస్తుంటారు. వీరు రాసిన కథనాలు ఆయా సామాజిక మాధ్యమాల్లో‘ ది వైర్, అల్ జజీరా, యూఎస్ ఏఐడీ వెబ్ సైట్ల’లో దర్శనమిస్తుంటాయి. ఈ ఫ్రీలాన్స్ గా చెప్పుకోబడే జర్నలిస్టులంతా నాణేనికి ఒకే వైపు అన్నట్లుగా వార్తా కథనాలు రాస్తూ భారత వ్యతిరేకతను, బయట పెట్టుకుంటారు. వీరికి భారీ మొత్తంలో నిధులు కూడా అందుతుంటాయి. హిందుత్వం, ఆర్టికల్ 370, శ్రీరాముడు, గో మాంసం, కశ్మీర్ లాంటి విషయాలపై ఫ్రీలాన్స్ జర్నలిస్టులు ఆందోళనలు రేకెత్తించే కథనాలను రాయడం గమనార్హం. పలుమార్లు వీటినే నమ్ముకొని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లాంటి వారు కూడా మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలని చాలాసార్లే ప్రయత్నించారు. అయినా వీరి ‘పప్పు’లు ఉడకలేదు. కాగా ఈ ఫ్రీలాన్స్ జర్నలిస్టులపై ఎక్స్ మాధ్యమంగా పలు విమర్శలు, ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.