హిందుజా చేతికి రిలయన్స్ క్యాపిటల్
ఉత్తర్వులు జారీ చేసిన లా ట్రిబ్యునల్

ముంబాయి: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ గ్రూప్ సంస్థను హిందూజా గ్రూప్ సొంతం చేసుకుంది. ఇక నుంచి ఈ క్యాపిటల్ సంస్థ సంబంధించిన అన్ని రకాల లావాదేవీలను హిందూజా సంస్థనే చూసుకోనుంది. ఇందుకు సంబంధించి జాతీయ లా ట్రిబ్యునల్ ఆమోదించింది. 2021 నవంబర్ లోనే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ బోర్డును రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. అనంతరం సంస్థ లావాదేవీలను పర్యవేక్షించేందుకు నాగేశ్వర్ రావును నియమించింది. ఈయన కంపెనీ కొనుగోలుకు సంబంధించి 2022 ఫిబ్రవరి లో బిడ్లను ఆహ్వానించారు. దీంతో ఐఐహెచ్ఎల్ (ఇందూస్ లాండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ లిమిటెడ్–హిందూజా గ్రూప్) ముందుకు వచ్చింది. ఇప్పటికే రూ. 2,750 కోట్లను చెల్లించింది. మరో రూ. 3వేల కోట్లను చెల్లించేందుకు సిద్ధమైంది. మొత్తం రూ. 9,861 కోట్లు చెల్లించేందుకు హిందూజా సంస్థ ఓకే చెప్పింది. దీంతో రిలయన్స్ క్యాపిటల్స్ కు రుణాలు అందజేసిన సంస్థల ఆందోళనలు పూర్తిగా పరిష్కారం లభించింది. కాగా ఫిబ్రవరి 26 నాటికి రియలన్స్ క్యాపిటల్ కొనుగోలుకు హిందూజా గ్రూప్ నకు మార్గం సుగమమైంది. పూర్తిస్థాయి పర్యవేక్షణను ఆ తరువాతే చేపట్టనుంది.