హీట్ వేవ్ తో స్పృహతప్పిన 80మంది విద్యార్థులు
80 students fainted due to heat wave
పాట్నా: హీట్ వేవ్ తో బిహార్ లో 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. స్పృహతప్పి పడిపోయారు. బుధవారం బిహార్ లో పలుచోట్ల ఎండ తీవ్రత 50.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లోని పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు ఎండతీవ్రతను తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు, పాఠశాల సిబ్బంది అప్రమత్తమై సపర్యలు చేపట్టడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఐఎండీ (కేంద్ర వాతావరణ శాఖ) పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లకు హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లవద్దని పేర్కొంది. మరోవైపు రానున్న 24 గంటల్లో కేరళను రుతుపవనాలు తాకే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. మరోవైపు రెమాల్ తుపాను కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురడవడంతో ప్రాణ, ఆస్తి నష్టాలు భారీగా సంభవించాయి.