కుంభమేళాలో 30 మంది మృతి

60మందికి గాయాలు పరిస్థితి అదుపులోనే: డిఐజీ వైభవ్​ కృష్ణ

Jan 29, 2025 - 19:14
 0
కుంభమేళాలో 30 మంది మృతి

లక్నో: మహాకుంభ మేళాలో తొక్కిసలాటో 30 మంది మృతి చెందారని, 60మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని డిఐజీ వైభవ్​ కృష్ణ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాకు వివరాలందించారు. బారికేడ్ల నుంచి తోసుకురావడమే తొక్కిసలాటకు ప్రధాన కారణమన్నారు. ఈ ఘటనలో మొత్తం 90 మందిని ఆసుపత్రిలో చేర్చగా 30 మంది మృతి చెందారని, వారిలో 25 మందిని గుర్తించామని, మరో ఐదు మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ చర్యలను చేపట్టామన్నారు. రాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్య తొక్కిసలాట ఘటన జరిగిందన్నారు. ప్రస్తుతం మహాకుంభంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయన్నారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు అప్పగించామని అంబులెన్సుల్లో వారి స్వస్థలాలకు పంపించామన్నారు.