సౌదీలో రోడ్డు ప్రమాదం 9మంది భారతీయులు మృతి!
9 Indians killed in road accident in Saudi
రియాద్: సౌదీ అరేబియా జిజాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు మృతి చెందారు. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం వివరాను జెడ్డాలోని భారత రాయబార కార్యాలయం విదేశాంగ శాఖకు తెలిపింది. ఈ ప్రమాదంపై కేంద్రమంత్రి ఎస్.జై శంకర్ విచారం వ్యక్తం చేశారు. వెంటనే భారతీయుల వివరాలపై ఆరా తీయాలన్నారు. క్షతగాత్రుల్లో భారతీయులంటే వారికి అత్యాధునిక చికిత్సలు అందించే ఏర్పాటు చేయాలన్నారు. 26 మంది కార్మికులతో కూడిన బస్సు దక్షిణ ఓడరేవు నగరమైన జిజాన్ ప్రాంతానికి బయలుదేరింది. ఈ బస్సు–ఎదురుగా వస్తున్న ట్రైలర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందన్నారు. మరిన్ని వివరాలపై భారత కాన్సులేట్, విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తుందని తెలిపారు. భారతీయులతోపాటు మొత్తం 15 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. కాగా మృతుల్లో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు ఉన్నట్లుగా భావిస్తున్నారు. వివరాలపై ఆరా తీస్తున్నారు.