తొక్కిసలాట మృతులకు రూ. 25 లక్షల పరిహారం

సీఎం యోగి ఆదిత్యనాథ్​ 

Jan 29, 2025 - 20:00
 0
తొక్కిసలాట మృతులకు రూ. 25 లక్షల పరిహారం

లక్నో: మహాకుంభ మేళా తొక్కిసలాటపై సీఎం యోగి ఆదిత్యనాథ్​ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం మరోమారు మీడియా ముందుకొచ్చారు. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మృతులకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. తొక్కిసలాట ఘటనపై ఉన్నతస్థాయివిచారణకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. తొక్కిసలాట జరిగిన వెంటనే గ్రీన్​ కారిడార్​ ను ఏర్పాటు చేసి రెస్క్యూ చర్యలను చేపట్టామన్నారు. నిరంతరం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రమాదానికి కారణాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని యోగి మీడియాకు వివరించారు.