బడ్జెట్​ ప్రణాళికలో మంత్రి సీతారామన్​

Minister Sitharaman in the budget plan

Jun 13, 2024 - 15:49
 0
బడ్జెట్​ ప్రణాళికలో మంత్రి సీతారామన్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్ర బడ్జెట్​ 2024–25 కోసం ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్​ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా గురువారం ఆమె ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. బడ్జెట్​ ప్రణాళికలో సమగ్ర విశ్లేషణలతో కూడిన సమాచారంతో అంకెలు వెల్లడించాలన్నారు. మోదీ 3.0ను ప్రతిబింబించేలా బడ్జెట్​ ను రూపొందించాలన్నారు. అదే సమయంలో బడ్జెట్​ ప్రణాళికలో సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించాలని అధికారులను సీతారామన్​ కోరారు. అయితే జూలై మూడో వారంలో కేంద్ర బడ్జెట్​ ను పార్లమెంట్​ లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాకాల పార్లమెంట్​ సమావేశాల అనంతరమే బడ్జెట్​ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. 

22 జూన్​ జీఎస్టీ కౌన్సిల్​ సమావేశం..

కాగా ఏడు బడ్జెట్​ లను సమర్పించిన తొలి ఆర్థికమంత్రిగా సీతారామన్​ రికార్డు నెలకొల్పనున్నారు. కాగా జూన్​ 22న జీఎస్టీ కౌన్సిల్​ 53వ సమావేశం నిర్వహించనున్నట్లు కౌన్సిల్​ తెలిపింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రితోపాటు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.