అమెరికా ట్రక్కు బీభత్సం 15మంది మృతి

15 people died in the American truck disaster

Jan 2, 2025 - 13:44
 0
అమెరికా ట్రక్కు బీభత్సం 15మంది మృతి

నిందితుడు ఐసీసీ ఉగ్రవాదే?
ఎఫ్​ బీఐ దర్యాప్తు వేగవంతం

వాషింగ్టన్​: అమెరికా న్యూ ఓర్లీన్స్​ ట్రక్కు బీభత్సం ఘటనలో మృతుల సంఖ్య 15కు పెరిగింది. ఈ ఘటనకు కారకుడైన షంషుద్దన జబ్బార్​ ను పోలీసులు ఎన్​ కౌంటర్​ చేశారు. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. చిన్నతనం నుంచే జబ్బార్​ ఒక రకమైన మతోన్మాదాన్ని కలిగి ఉండేవాడని గుర్తించారు. జబ్బార్​ ట్రక్కుపై ఐసీసీ జెండాతో వేగంగా నడుపుతూ కావాలనే నూతన సంవత్సవేడుకలు నిర్వహిస్తున్న జనాలపైకి తీసుకువెళ్లాడు. అమెరికాలోనే జన్మించినా ఇతనిలో అడుగడుగునా ఉగ్రభావజాలం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇతను మాజీ సైనికుడన్నారు. ట్రైలర్​ పార్క్​ లోని అతని ఇంట్లో చేసిన సోదాల్లో పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసు విచారణలో ట్రక్కును అద్దెకు తీసుకున్నట్లు, ఎక్కువమందిని చంపాలని ప్రణాళిక రచించినట్లు తెలుస్తుంది. ఈ దాడులతో యావత్​ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడి ఘటనను అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్​ బీఐకి అప్పగించారు.

షంసుద్దీన్ జబ్బార్, ఇస్లామిక్ స్టేట్ జెండాను ఊపుతూ, లూసియానాలో న్యూ ఇయర్ జరుపుకుంటున్న జనాలపై ఫోర్డ్ పికప్ ట్రక్కును పోనిచ్చాడు. దీంతో బుధవారం 10 మంది మృతి చెందగా, 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు ట్రక్కుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జబ్బార్​ మృతి చెందాడు.