ఏడోదశ పోలింగ్ ఉదయం 9 గంటల వరకు 11.31 శాతం నమోదు
11.31 percent registration till 9 am of the 7th phase polling
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఏడో దశలో ఉదయం 9 గంటల వరకు 11.31 శాతం పోలింగ్ నమోదైంది. యూపీలో 13 స్థానాలకు గాను 12.94 శాతం ఓటింగ్ నమోదు కాగా బిహార్ లో 8 స్థానాలకు గాను 10.58 శాతం, ఝార్ఖండ్ లో మూడు స్థానాలకు గాను 12.15 శాతం, హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు స్థానాలకు గాను 14.35 శాతం, ఒడిశాలో ఆరుస్థానాలకు గాను 7.69 శాతం, చండీగఢ్ లో ఒక స్థానానికి గాను 11.45 శాతం, పశ్చిమ బెంగాల్ లో 13 స్థానాలకు గాను 12.63 శాతం పోలింగ్ నమోదైంది.