జీపీఎస్​ టోల్​కు సిద్ధం రాజ్యసభలో మంత్రి గడ్కరీ

శాటిలైట్​ ఆధారిత జీపీఎస్​ ద్వారా టోల్​ కలెక్షన్​ సిస్టమ్​ ను త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ స్పష్టం చేశారు.

Feb 7, 2024 - 17:24
 0
జీపీఎస్​ టోల్​కు సిద్ధం రాజ్యసభలో మంత్రి గడ్కరీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: శాటిలైట్​ ఆధారిత జీపీఎస్​ ద్వారా టోల్​ కలెక్షన్​ సిస్టమ్​ ను త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ స్పష్టం చేశారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గురువారం సమాధానమిచ్చారు. కొత్త విధానంలో వాహనం నంబర్​ ప్లేట్​ తో నేరుగా బ్యాంకు ఖాతాల నుంచి టోల్​ ను మినహాయించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న టోల్​ ప్లాజాలను తొలగించి జాతీయ రహదారిపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కొత్త టోల్​ విధానం ద్వారా సాఫీ ప్రయాణానికి మార్గం సుమగమవుతుందని గడ్కరీ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎనిమిది కోట్ల పదమూడు లక్షలకు పైగా ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ చేశామని, సగటు రోజువారీ వసూళ్లు రూ. 170 నుంచి రూ. 180 కోట్లని మంత్రి తెలిపారు.