ప్రతి ఇంట్లో రామజ్యోతి వెలిగించాలి.. దేశ ప్రజలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి
అయోధ్యతో పాటు దేశం మొత్తం శ్రీరామ నామస్మరణతో మార్మోగుతోంది. పల్లె నుంచి నగరానికి కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. శ్రీరామ ప్రాణ ప్రతిష్ట రోజున మరో దీపావళి జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీపావళి వేడుకలు ప్రారంభించారు.