ఎమ్మెల్యే అబూ అజ్మీపై యోగి ఫైర్
Yogi fire on MLA Abu Azmi

లక్నో: ఔరంగజేబుపై మహారాష్ర్ట ఎస్పీ ఎమ్మెల్యే అబూ అజ్మీ వ్యాఖ్యలపై యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. బుధవారం యూపీ అసెంబ్లీలో ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ మండిపడ్డారు. వెంటనే ఎస్పీ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశార. లేదంటే ఆయన్ను చికిత్స కోసం యూపీకి పంపించాలన్నారు. ఔరంబజేబును హిరో అని పిలిచే వ్యక్తికి భారత్ లో ఉండే హక్కు లేదన్నారు. ఔరంగజేబు జిజియా పన్ను, దేవాలయాలను కూల్చడం, ఇస్లామీకరణ ప్రయత్నం, హిందువుల అణచివేతకు గురి చేసిన కీచక పాలకుడన్నారు. షాజహాన్ నే ఆగ్రకోటలో బంధించి అతనికి తిండి తిప్పలు అందించాడా? అని ప్రశ్నించారు. భారతీయ గౌరవం, సంస్కృతి, సాంప్రదాయాలపట్ల ఎస్పీ పార్టీ, నాయకులు ఏ మాత్రం విలువనీయరని మరోమారు ఋజువైందన్నారు.