అసెంబ్లీ నుంచి అబూ సస్పెండ్
Abu suspended from assembly

పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ఔరంగజేబుపై అనుచిత వ్యాఖ్యల దుమారం
ముంబాయి: ఔరంగజేబుపై ప్రేమను చాటుకున్న ఎస్పీ ఎమ్మెల్యే అబూ అజ్మీపై మహారాష్ర్ట అసెంబ్లీ ముగిసే వరకు నిషేధం (సస్పెండ్) విధించారు. బుధవారం ఆయన్ను బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాగా అజ్మీ వ్యాఖ్యలపై మహారాష్ర్టలోనే గాక దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతుంది. ఈ అనుచిత వ్యాఖ్యలపై భారత శిక్షాస్మృతిఓని 299, 356 (1), 356(2), 302 సెక్షన్ల కింద ముంబాయిలో కేసులు కూడా నమోదయ్యాయి. తన వ్యాఖ్యలపై పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన ఆజ్మీ క్షమాపణ చెప్పాడు అబూ అజ్మీ ఎస్పీ ముంబాయిలోని మంఖుర్ద్ శివాజీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఈయన సస్పెన్షన్ పై ఎస్పీ ఎమ్మెల్యే షేక్ అసెంబ్లీ స్పీకర్ ను కలవనున్నారు. వ్యాఖ్యలపై చట్టపరమైన అభిప్రాయం తీసుకుంటామని చెప్పారు.
అబూ వ్యాఖ్యలు..
ఔరంగజేబు అనేక దేవాలయాలను నిర్మించాడు. పండితులు ఔరంగజేబు కోసం ఒక మసీదు నిర్మించి ఇచ్చారని, అతని పాలనలో భారత జీడీపీ 24 శాతంగా ఉండేదని ఇలా అనేక రకాల వ్యాఖ్యలు చేశాడు.