వైఆర్–4తో భారత్, పాక్, బంగ్లాలకు ముప్పు!
2032లో భూమిని ఢీకొట్టనున్న ఉల్క?

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వైఆర్–4 ఉల్క భారత్, పాక్, బంగ్లాలలో విధ్వంసం సృష్టించనుందా? అంటే అయి ఉండొచ్చనే సమాధానం వస్తుంది. అయితే ఈ ఉల్క ప్రస్తుతం భూమికి ఆరు కోట్ల యాభై లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమిదిశగా వేగంగా దూసుకొస్తుంది. శాస్ర్తవేత్తల అంచనా ప్రకారం ఈ ఉల్క 2032లో భూమిని ఢీకొట్టే అవకాశం ఉంది. ఈ ఉల్కను చిలీలోని రియో హోర్టాడోలో ఉన్న పర్యవేక్షణ కేంద్రం 2024 డిసెంబర్ 27న కనుగొంది. ఈ ఉల్క వల్ల భూమికి ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని అట్లాస్ (ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్) హెచ్చరిక జారీ చేయగా, పలు దేశాల్లో ఆందోళనలు చెలరేగాయి. కాగా ఈ వైఆర్–4 ఆస్టరాయిడ్ పై నాసా, చైనా లోని టెలిస్కోప్ ద్వారా కూడా అంతరిక్ష శాస్ర్తవేత్తలు దృష్టి సారించారు. భూమికి ముప్పు తప్పాలంటే తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. కాగా ఈ ఆస్టరాయిడ్ ప్రయాణ దిశ భారత్, బంగ్లా, పాక్ ల వైపు ఉందని శాస్ర్తవేత్తలు అంచనా వేశారు.