లవ్ జిహాద్, మతమార్పిళ్ల నిరోధానికి కమిటీ
ఉత్తర్వులు జారీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం

ముంబాయి: లవ్ జిహాద్, బలవంతపు మతమార్పిళ్లకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. శనివారం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర డీజీపీ అధ్యక్షతన ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో స్త్రీ శిశు సంక్షేమం, మైనార్టీ వ్యవహారాలు, చట్టం, న్యాయవ్యవస్థ, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయ శాఖల కార్యదర్శులు, హోం శాఖ డిప్యూటీ కార్యదర్శులకు చోటు కల్పించారు. ఈ కమిటీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో చట్టపరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోనుంది. లవ్ జిహాద్, మతమార్పిళ్లను నిరోధించేందుకు ఈ కమిటీ సిఫార్సులను చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. లవ్ జిహాద్, మతమార్పిళ్లను అడ్డుకునేందుకు పలు చట్టపరమైన సమస్యలు ఎదురవుతుండడంతో ప్రభుత్వం ఈ దిశగా చర్యలకు ముందుకు వెళుతుంది.