మహాకుంభమేళాపై దుష్ప్రచారం సహించబోం
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

లక్నో: మహా కుంభమేళాను ఒకవైపు ప్రపంచం కీర్తిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్, మిత్రపక్షాలు దుష్ప్రచారం చేయడాన్ని సహించబోమని, సనాతన ధర్మాన్ని అగౌరవపరిచే ప్రయత్నాలను కూడా సహించబోమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎస్పీ, కాంగ్రెస్ లపై విరుచుకుపడ్డారు. మహాకుంభమేళా కేవలం మతపరమైన కార్యక్రమం కాదని, భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని అన్నారు. ఈ మహోత్తర కార్యక్రమంలో తప్పుడు సమాచారాన్ని ప్రతిపక్షాలు వ్యాప్తి చేస్తున్నాయన్నారు. సనాతన ధర్మం దేశ ఆత్మ, గౌరవాన్ని నిలబెట్టడం మనందరి కర్తవ్యమన్నారు. తప్పుడు కథనాలు, వ్యాఖ్యలతో చేస్తున్న ప్రయత్నాలను ఎన్నటికీ సహించబోమన్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ సనాతన దర్మం, ఆధ్యాత్మికం, సాంస్కృతిక ప్రాముఖ్యతలను విపక్షాలు విస్మరించాయని యోగి కాంగ్రెస్, మిత్రపక్షాలను తూలనాడారు.