ప్రధాని దార్శనికత భేష్
Prime Minister Darshankata Bhesh

యూకె మాజీ ప్రధాని రిషి సునాక్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత వినడం ఎల్లప్పుడూ ఉత్సాహంగానే ఉంటుందని యూకె మాజీ ప్రధాని రిషి సునాక్ అన్నారు. న్యూ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని, రిషిసునాక్ మంగళవారం రాత్రి కలిశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి. చర్చల సారాంశాన్ని బుధవారం ప్రధాని మోదీ, రిషి సునాక్ సామాజిక మాధ్యమం వేదికగా పంచుకున్నారు.
రిషి భారత్ కు గొప్ప స్నేహితుడని ప్రధాని కితాబిచ్చారు. భారత్ తో యుకె బంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. రిషి, ఆయన కుటుంబ సభ్యులను కలవడం ఆనందంగా ఉందని మోదీ అన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చలు, సంభాషణలు అద్భుతంగా జరిగాయన్నారు. ప్రధానమంత్రి పోస్ట్ కు రిషి సునాక్ సమాధానం ఇస్తూ ఇరుదేశాల బంధాల బలోపేతానికి ప్రధాని మోదీ తనకు నిరంతరం మద్ధతు అందించేవారన్నారు. తనను, కుటుంబాన్ని స్వాగతించినందుకు ప్రధాని మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని దార్శనికత ఎప్పుడూ బలంగానే ఉంటుందని రిషి సునాక్ చెప్పారు.
సునాక్ ఇటీవల భారత్ లో సందర్శించి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన్ను కుటుంబంతో సహా కలిశారు.