అదానీ గ్రూప్​ పన్ను చెల్లింపులు రూ. 58,104 కోట్లు!

పారదర్శకతే నమ్మకానికి పునాది అన్న గౌతమ్​ అదానీ

Feb 23, 2025 - 20:47
 0
అదానీ గ్రూప్​ పన్ను చెల్లింపులు రూ. 58,104 కోట్లు!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అదానీ గ్రూప్​ సంస్థలు 2023–24కు సంబంధించి భారత్​ సహా ప్రపంచదేశాలకు చెల్లించిన పన్నులు రూ. 58,104.4 కోట్లుగా ఉందని ఆదివారం ఆ సంస్థ నివేదిక ద్వారా వెల్లడించింది. అదానీ సంస్థల్లోని ఏడు కంపెనీలు అదానీ ఎంటర్‌ప్రైజెస్, పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, గ్రీన్ ఎనర్జీ, ఎనర్జీ సొల్యూషన్స్, పవర్, టోటల్ గ్యాస్, అంబుజా సిమెంట్స్ -సంస్థలు ఈ పన్ను మొత్తాన్ని చెల్లించాయి. పన్ను చెల్లింపులు తమ సంస్థలు చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలోని వృద్ధిని సూచిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ సంస్థలవి పన్ను చెల్లింపులో పారదర్శకతను పాటిస్తాయని తెలిపారు. గత సంవత్సరం చెల్లించిన పన్నులు రూ. 46,610.2 కోట్లుగా తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పన్ను చెల్లింపుల్లో గణనీయ పెరుగుదల ఏర్పడింది. కాగా ప్రకటనలో అదానీ గ్రూప్​ చైర్మన్​ గౌతమ్​ అదానీ సందేశాన్ని కూడా వెల్లడించారు. 

పారదర్శకత అనేది నమ్మకానికి పునాది అని, స్థిరమైన వృద్ధికి నమ్మకం అత్యంత అవసరమని అన్నారు. దేశ ఖజానాకు అదానీ సహకారం తమ బాధ్యతను తెలియజేస్తుందన్నారు. తమ సంస్థలు జవాబుదారీ తనంతో పనిచేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తుండడం గర్వకారణమన్నారు. అదే సమయంలో సంస్థల్లోని వాటాదారుల విశ్వాసాన్ని మరింత పెంపొందించే చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రకృతి, ఆవిష్కరణలు, వాటాదారుల లక్ష్యాలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అదానీ గ్రూప్​ ముందుకు వెళుతూ దేశ ప్రయోజనాలను కాపాడుతుందని గౌతమ్​ అదానీ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.