యూఎన్​ ఎస్​ సీలో చైనాకు చురకలు

China in the UNSC

Feb 19, 2025 - 18:24
 0
యూఎన్​ ఎస్​ సీలో చైనాకు చురకలు

న్యూయార్క్​: యూఎన్​ ఎస్​ సీ (ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి)లో శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచేందుకు వ్యతిరేకించే దేశాలు ప్రగతిశీల విధానాలకు వ్యతిరేకులని భారత్​ పరోక్షంగా చైనాను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది. బుధవారం యూఎన్​ ఎస్​ సీ చైనా ఆధ్వర్యంలో జరిగిన భద్రతా సమావేశంలో భారత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి పర్వతనేని హరీష్​ ప్రసంగించారు. చైనా అనుసరిస్తున్న విధానాలపై దుమ్మెత్తి పోశారు. ఇకపై ఇలాంటి వైఖరులను ఆమోదించలేమన్నారు. చిన్నదేశాలు, గ్లోబల్​ సౌత్​ దేశాల పట్ల అన్యాయంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఐక్యరాజ్యసమితిలో చేరేందుకు పూర్తిగా అర్హులన్నారు. యూఎస్​ఎస్​ సీలో వెంటనే సంస్కరణలు జరగాలన్నారు. ప్రాథమిక సూత్రాలు అవసరమని చెప్పారు. ఈ చర్యలతో సభ్యుల సంఖ్య పెరగడమే గాకుండా, ఆయా దేశాల్లో సత్సంబంధాలు నెలకొనే అవకాశం ఉందన్నారు. ఇకపై పూర్తి పరిశీలన లేకుండా యూఎన్​ ఎస్​ సీలో దేశాల సభ్యత్వం కాదనే వాదనను అంగీకరించలేది లేదని చైనాకు చురకలంటించారు. గతేడాది యూఎన్​ఎస్​సీలో ప్రధాని మోదీ సంస్కరణలపై మాట్లాడిన విషయాలను ఆయన గుర్తు చేశారు.