కేదార్​ నాథ్​, హేమకుండ్​ రోప్​ వేలకు కేబినెట్​ ఆమోదం

Cabinet approval for Kedarnath and Hemakund rope auction

Mar 5, 2025 - 15:58
Mar 5, 2025 - 18:30
 0
కేదార్​ నాథ్​, హేమకుండ్​ రోప్​ వేలకు కేబినెట్​ ఆమోదం

రూ.4,081 కోట్లు, రూ.2,730 కోట్ల వ్యయం
వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పర్వతమాల ప్రాజెక్టు కింద సోన్​ ప్రయాగ్​ నుంచి కేదార్​ నాథ్​ 12.9 కి.మీ.వరకు, చమోలీలో హేమకుండ్​ సాహిబ్​ గోవింద్​ ఘాట్​ 12.4కి.మీ. రోప్​ వేలు నిర్మించనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్​ చెప్పారు. బుధవారం కేంద్ర కేబినెట్ ప్రధాని మోదీ​ అధ్యక్షతన జరిగిన సమావేశంలోని నిర్ణయాన్ని మీడియాకు వెల్లడించారు. రోప్​ వేల ప్రాజెక్టులకు రూ. 4,081 కోట్లు, రూ. 2,730 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే 8 నుంచి 9 గంటలు పట్టే ప్రయాణ సమయం కేవలం 36 నిమిషాలకు తగ్గుతుందన్నారు. ఇందులో 36 మంది కూర్చునే సామర్థ్యం ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు డీబీఎఫ్​ వోట మోడ్​ 3 ఎస్​ సాంకేతిక వ్యవస్థతో అభివృద్ధి చేస్తామని వివరించారు. కేదార్​ నాథ్​ రోప్​ వే ద్వారా గంటకు 1800మందిని గమ్యస్థానాలకు చేరుస్తాన్నారు. రోజుకు 18వేల మంది ప్రయాణించవచ్చని తెలిపారు. అదే సమయంలో గోవింద్​ ఘాట్​ ఏటా రెండు లక్షల మంది వస్తారన్నారు. దీంతో కొండ ప్రాంతంలో ఆసుపత్రులు, హోటళ్లు, మౌలిక సదుపాయాల కల్పన తదితరాలు పెరుగుతాయన్నారు. రోప్​ వే ప్రాజెక్టులు వేగవంతమైన అభివృద్ధిలో ముఖ్యమైన అడుగన్నారు. దీంతో కేదార్​ నాథ్​ ఆలయం సందర్శన సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్​ కమిటీ సీసీఇఎ ఆమోదం తెలిపిందన్నారు. 

ఎల్​ హెచ్​ డీసీపీకి రూ. 3,880 కేటాయింపు..

2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎల్​ హెచ్​ డీసీపీ (లైవ్​ స్టాక్​ హెల్త్​ అండ్​ డిసిజ్​ కంట్రోల్​ ప్రోగ్రామ్​) కేబినెట్​ రూ. 3,880 కోట్లను కేటాయించారు. దీంతో పశువులు కలిగిన రైతులకు లాభం చేకూరనుంది. పశుసంవర్ధక శాఖ ద్వారా పశువైద్యానికి ఈ నిధులను వినియోగించనున్నారు. పశువులకు సంక్రమిస్తున్న పలు రోగాలను నయం చేసేందుకు సరసమైన ధరల్లో జనరిక్​ పశువైద్య మందులను అందుబాటులో ఉంచనున్నారు. వ్యాధుల నివారణ, చికిత్స, పశుపోషణను పెంపొందించడమే లక్ష్యంగా నిధులను కేటాయించినట్లు అశ్వినీ వైష్ణవ్​ వెల్లడించారు.