ఢిల్లీ ఖజానా ఖాళీ హామీలను పూర్తి చేస్తాం
We will complete Delhi Treasury Vacancy Guarantees

సీఎం రేఖా గుప్తా
24 నుంచి మూడురోజులపాటు అసెంబ్లీ సమావేశాలు
వివరాలు ముందే వెల్లడించిన సీఎం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ ఖజానా పూర్తిగా నిండుకుంది. ఖజానాను నింపడంతోపాటు తొలి అసెంబ్లీ సమావేశాల్లో కాగ్ నివేదికను ప్రవేశపెట్టనున్నామని, మహిళలకు రూ. 2500 కేటాయించే ప్రతిపాదనపై చర్చించనున్నట్లు సీఎం రేఖా గుప్తా సమావేశాలకు ఒకరోజు ముందు చెప్పారు. 27 ఏళ్ల తరువాత బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడ్డాక తొలి మూడురోజులపాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నారు. తొలిరోజు 24 (సోమవారం) స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుందన్నారు. అనంతరం తొలి సెషన్ లోనే కాగ్ నివేదికను కూడా అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. ఢిల్లీ ప్రజల ప్రయోజనాలు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్ని పనులను ప్రారంభిస్తామని చెప్పారు. మహిళలకు రూ. 2500 హామీ ప్రకారం అందజేస్తామని వెనక్కు తగ్గేదేలేదన్నారు. ఇప్పటికే అధికారుల నుంచి అన్ని రంగాల నివేదికలను తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నివేదికల ద్వారా మాజీ ప్రభుత్వ హయాంలో ఖజానా పూర్తిగా నిండుకున్నట్లు గమనించామన్నారు. వారి అనాలోచిత నిర్ణయాలు, ధోరణల వల్ల ఢిల్లీకి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఖజానాను మెరుగుపరిచే పనులకు శ్రీకారం చుట్టడంతోపాటు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే చర్యలు తీసుకుంటామని రేఖ గుప్తా చెప్పారు.