విశ్వాసానికి కేంద్రంగా క్యాన్సర్​ ఇన్​ స్టిట్యూట్

​ బాగేశ్వర్​ ధామ్​ లో ప్రధాని నరేంద్ర మోదీ

Feb 23, 2025 - 16:42
Feb 23, 2025 - 17:30
 0
విశ్వాసానికి కేంద్రంగా క్యాన్సర్​ ఇన్​ స్టిట్యూట్

ఆసుపత్రిలో ఒక వార్డుకు ప్రధాని తల్లి పేరు
ఆలయ పరిపాలకుడు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి

భోపాల్​: తక్కువ సమయంలో వీరుల భూమికి రెండోసారి రావడం తన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బాలాజీ ప్రభుత్వ క్యాన్సర్​ ఇన్సిట్యూట్​ విశ్వాసానికి కేంద్రంగా మారబోతుందన్నారు. ఇంతటి గొప్ప బాధ్యతను తలకెత్తుకున్న ధీరేంద్ర కృష్ణ శాస్ర్తిని ప్రధాని మోదీ అభినందించారు. ఆదివారం మధ్యప్రదేశ్​ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ బుందేల్​ ఖండ్​ లోని ఛతర్​ పూర్​ బాగేశ్వర్​ ధామ్​ ఆలయానికి చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేయనున్న క్యాన్సర్​ ఇన్సిట్యూట్​ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ధీరేంద్ర కృష్ణ శాస్ర్తి భారత ఐక్యతను పెంపొందించడం నిమగ్నం కావడం సంతోషకరమన్నారు. మానవాళి ప్రయోజనాల కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం ఎనలేనిదన్నారు. ఇప్పుడు బాగేశ్వర్​ ధామ్​ లో కేవలం భజనలే కాదని, ఆహారం, ఆరోగ్యకరమైన జీవితాన్ని కూడా పొందవచ్చన్నారు. 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక్కటే చర్చ కనిపిస్తుందన్నారు. అదే మహాకుంభమేళాను దర్శిస్తున్న భక్తులు సంఖ్యగా పేర్కొన్నారు. ఈ మేళాలో పాల్గొంటున్న భక్తుల విశ్వాసాలు, నమ్మకాలను చూసి ప్రపంచదేశాలు సైతం నివ్వెరపోతున్నాయని తెలిపారు. ఆదివారం వరకు 62 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడంతో ప్రపంచదేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. 

ఒక వార్డుకు ప్రధాని తల్లి పేరు..
బాగేశ్వర్​ ధామ్​ బుందేల్​ ఖండ్​ కు రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరూ రావడం ఎంతో సంతోషంగా ఉందని ధీరేంద్ర శాస్ర్తి అన్నారు. ప్రభుత్వం, ప్రజలు, భక్తుల సహకారంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. భక్తి, ఆహారం, ఆరోగ్యం బాగేశ్వర్​ ధామ్​ లో లభిస్తాయని చెప్పారు. పలువురు చేస్తున్న ఆరోపణలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. క్యాన్సర్ ఇన్​ స్టిట్యూట్​​ ఆసుపత్రిలో ఒక వార్డుకు ప్రధాని నరేంద్ర మోదీ తల్లి పేరు పెడతామన్నారు. ప్రస్తుతం వంద పడకలతో ప్రారంభమయ్యే ఈ ఆసుపత్రి భవిష్యత్​ లో ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆసుపత్రిగా రూపొందించేందుకు ప్రయత్నిస్తామని ధీరేంద్ర శాస్ర్తి తెలిపారు.