శరణార్థి ముసుగులో ఉగ్రముఠాలు
Terrorist gangs in the guise of refugees

వెస్ట్ బ్యాంక్ లో యుద్ధట్యాంకులు
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్
జెరూసలెం: వెస్ట్ బ్యాంక్ లోని కొన్ని పట్టణాల్లో శరణార్థి శిబిరాల ముసుగులో కొన్ని ఉగ్రవాద ముఠాలు ఉన్నట్లు తెలుస్తుందని, ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా తుదముట్టించే వరకు తమ దేశ సైన్యాన్ని పాలస్తీనా భూభాగంలో సిద్ధంగా ఉండాలని ఆదేశించామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ చెప్పారు. ఆదివారం మీడియాతో కాట్జ్ మాట్లాడారు. వెస్ట్ బ్యాంక్ లోని కొన్ని ప్రాంతాల్లో దాడులను ముమ్మరం చేస్తామని, మరిన్ని యుద్ధ ట్యాంకులను పంపుతున్నట్లు తెలిపారు. కాగా గురువారం రాత్రి ఇజ్రాయెల్ లోని మూడు బస్సులపై జరిగిన బాంబుదాడులకు ప్రధాన సూత్రధారులు ఇక్కడి నుంచే ఆదేశాలను ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి అక్కడ ఉన్న ఉగ్రనాయకుల వేటకు సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు పాలస్తీనా ఖైదీలను ఇప్పుడప్పుడే విడుదల చేయబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. తమ బందీలను అవమానకర రీతిలో అప్పజెప్పడం ఆపాలని ఇజ్రాయెల్ హమాస్ కు స్పష్టం చేసింది. కాగా ఇజ్రాయెల్ తీసుకుంటున్న చర్యల పట్ల మరోమారు మధ్యవర్తిత్వ దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితి, రెడ్ క్రాస్ వర్గాల అధికారులు పెద్ద ఎత్తున ప్రభుత్వంతో చర్చలకు దిగినట్లు సమాచారం.