ఉగ్రదాడులపై హెచ్చరిక!
సింగపూర్ మంత్రి షణ్ముగం

సింగపూర్: దేశంలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ప్రజలు ఇలాంటి ఘటనలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆ దేశ న్యాయశాఖ, హోం వ్యవహారాల శాఖ మంత్రి షణ్ముగం హెచ్చరించారు. ఇటీవల ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశాక మంగళవారం మీడియాతో మంత్రి మాట్లాడుతూ ఈ హెచ్చరికను జారీ చేశారు. మరింతమంది ఉగ్రవాదులు దేశంలో నక్కి ఉండే అవకాశం ఉందని అన్నారు. ఉగ్రభావజాలానికి తమ ప్రాంతంలో చోటు లేదన్నారు. ప్రజలు కూడా అలాంటి భావజాలం ఉన్నవారిని గుర్తిస్తే ప్రభుత్వానికి, పోలీసులకు సమాచారం అందజేయాలన్నారు. జాత్యాహంకారం, మితవాద ఆధిపత్య ధోరణి వ్యక్తులకు ఇక్కడ చోటు లేదన్నారు. పట్టుబడ్డ ఓ విద్యార్థి (ఉగ్రవాది) గురించి మాట్లాడుతూ.. ఇతడు చైనీయులు, మలేయ్ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.