దల్లేవాల్​ నిరసనపై మొండిపట్టుదలొద్దు

Don't insist on Dallewal's protest

Dec 28, 2024 - 14:36
 0
దల్లేవాల్​ నిరసనపై మొండిపట్టుదలొద్దు

సహచర రైతులను మందలించిన సుప్రీం కోర్టు
ముందుగా ఆసుపత్రిలో చికిత్స అందించాలి
అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకోవాలి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఖనౌరీ సరిహద్దులో నిరసన చేపడుతున్న రైతులను సుప్రీం కోర్టు మందలించింది. ఓ వైపు రైతు క్షేమాన్ని కోరే జగ్జీత్​ సింగ్​ దల్లెవాల్​ ఆరోగ్య పరిస్థితులు రోజురోజుకు విషయమిస్తుంటే సహచర రైతులు మొండిపట్టుదలకు పోవడం సరికాదని పేర్కొంది. శనివారం పంజాబ్​, హరియాణా సరిహద్దు ఖనౌరీలో చేపట్టిన రైతు జగ్జీత్​ సింగ్​ ఆరోగ్యంపై  సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే ఆయనకు అత్యవసర చికిత్స అందించేందుకు రైతులు పోలీసులకు, వైద్యులకు సహకరించాలని స్పష్టం చేసింది. ఆయన్ను ఆసుపత్రిలో చేర్చేందుకు పంజాబ్​ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు 31వ తేదీ వరకు గడువు విధించింది. మరోవైపు పంజాబ్​ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై కూడా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయన ఆసుపత్రిలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్న రైతులకు అర్థమయ్యే రీతిలో వివరించాలని న్యాయమూర్తి పంజాబ్​ చీఫ్​ సెక్రెటరీకి సూచించారు. పంజాబ్​ కు సహాయం కావాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకోవాలని సూచించింది. నవంబర్​ 26 నుంచి దల్లేవాల్​ నిరవధిక నిరాహార దీక్షకు కూర్చొన్నారు. ఆయన దీక్ష నెల దాటిపోయింది. దీంతో దల్లేవాల్​ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతుంది. రోజురోజుకు ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది.