ప్రయాగ్ రాజ్ లో కేంద్రమంత్రి షా సంగమ స్నానం
Union Minister Shah's confluence bath in Prayagraj
లక్నో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంగమ స్నానం ఆచరించారు. సోమవారం ఉదయం ప్రయాగ్ రాజ్ కు కుటుంబ సమేతంగా చేరుకున్న అమిత్ షాకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికారు. అనంతరం సాధు సంతువులతో భేటీ అయ్యారు. గంగా, యమున, పురాణ సరస్వతి సంగమం వద్ద ఆరైల్‌లోని వీఐపీ ఘాట్‌కు చేరుకున్నారు. సంగమ స్నానానికి ముందు గంగా పూజను నిర్వహించారు. సాధు సంతువులతో కలిసి పుణ్య స్నానమాచరించి వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో ఉన్న వటవృక్షం చరిత్ర ఉన్నది కావడంతో ఆ వటవృక్షానికి పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ప్రసాదాలు స్వీకరించారు. పుణ్యస్నానానికి ముందు కేంద్రమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం వేదికగా మాట్లాడుతూ.. సంగమ స్నానం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మహామేళా ద్వారా ఐక్యతా సందేశం వెళ్లడం సంతోషకరమన్నారు. గుజరాత్ యువత మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున విచ్చేసి పుణ్య స్నానాలారించాలని విజ్ఞప్తి చేశారు.