రాజ్యాంగం, భరతమాత వేరు కాదు కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Union Minister G. Kishan Reddy said the Constitution and Bharatamata are not separate

Jan 25, 2025 - 20:13
 0
రాజ్యాంగం, భరతమాత వేరు కాదు కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

నేడే సంవిధాన్​ (రాజ్యాంగం) గౌరవ్​ అభియాన్​ యాత్ర
భారతమాత ఫౌండేషన్​ ద్వారా మహా హారతి నిర్వహణ
రాజ్యాంగం ప్రశ్నలు లేవనెత్తేవారు అర్థం చేసుకోవాలి
140 కోట్ల ప్రజలు, సైనికులకు హారతి అంకితం
గవర్నర్​ తోపాటు ప్రముఖుల హాజరు

నా తెలంగాణ, హైదరాబాద్​: సంవిధాన్​ (రాజ్యాంగం) గౌరవ అభియాన్​, భరతమాత గౌరవం ప్రతీ ఒక్క భారతీయునికి వేరు కాదని, ఆదివారం నుంచి ఈ యాత్రను ప్రారంభించి వచ్చే ఏడాది 2026 జనవరి 26 వరకు నిర్వహిస్తామని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్​ రెడ్డి అన్నారు. భరతమాత ఫౌండేషన్​ ద్వారా ఈ మహా హారతి కార్యక్రమాన్ని గత ఏడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని ఆదివారం నిర్వహించే యాత్ర 8వ సంవత్సరంగా పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం సిద్ధించడంలో మహాత్మాగాంధీ, సుభాష్​ చంద్రబోస్​, సర్ధార్​ వల్లభాయ్​ పటేల్​, అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో మహానీయుల కృషి దాగి ఉందన్నారు. శనివారం సాయంత్రం నెక్లెస్​ రోడ్డు పీపుల్స్​ ప్లాజాలో జరిగిన  కార్యక్రమంలో భారతమాత ఉరేగింపు కార్యక్రమంలో పాల్గొని హారతినిచ్చారు. 

ఈ సందర్భంగా కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో కొంతమంది భారత రాజ్యాంగంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని వారు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉందన్నారు. భారత రాజ్యాంగం, భరతమాత తమ కోసం ఒక్కటేనని అర్థం చేసుకోవాలన్నారు. 140 కోట్ల మంది ప్రజలు, దేశ సైనికులు, దేశ అభివృద్ధి కోసం పాటుపడే ప్రతీ ఒక్కరికి రేపటి మహాహారతి కార్యక్రమం అంకితమన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ర్ట గవర్నర్​ హాజరవుతారన్నారు. గతంలో కూడా అనేకమంది ప్రముఖులు హాజరయ్యారని, ఈ సారి కూడా వారందరూ హాజరవుతారని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. దేశ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.