అట్టారి వాఘా బోర్డర్ లో ఘనంగా బీటింగ్ రిట్రీట్
Beating Retreat in Attari Wagah Border
చండీగఢ్: అట్టారీ వాఘా సరిహద్దులో గణతంత్ర వేడుకల సందర్భంగా బీటింగ్ రిట్రీట్ నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ ఎత్తున వీక్షకులు వచ్చారు. బీఎస్ఎఫ్ జవాన్లు భూమి బద్ధలయ్యేలా చేసిన బీటింగ్ రిట్రీట్ ఆకట్టుకుంది. దేశ త్రివర్ణ పతాకాన్ని చేతబూని పరేడ్ నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు స్వీట్లు పంచుకున్నారు. పంజాబ్ లోని అమృత్ సర్ జిల్లాలో ఉన్న అట్టారీ వాఘా సరిహద్దు భారత్ మాతా కీ జై, వందేమాతరం అన్న నినాదాలతో హోరెత్తింది. బీటింగ్ రిట్రీట్ భారత్–పాక్ సరిహద్దు వద్ద ప్రతీరోజూ నిర్వహిస్తారు. సైనికుల క్రమశిక్షణ, ఉత్సాహం, దేశభక్తిని ఈ కార్యక్రమం ద్వారా చాటుతారు. సూర్యాస్తమయం సమయంలో ఇరుదేశాలు తమ తమ పతాకాలను అవనతం చేస్తారు.