గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలిపిన బాలీవుడ్ ప్రముఖులు
Bollywood celebrities who wished for Republic Day
ముంబాయి: 76వ గణతంత్ర వేడుకలను బాలీవుడ్ ప్రముఖులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం తమ ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సునీల్ శెట్టి, హేమామాలిని, అనుపమ్ ఖేర్, శిల్పాశెట్టి, అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా, అనన్య పాండే, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, జాన్వీ కపూర్, కరణ్ జోహార్, అలియా భట్, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, అక్షయ్ కుమార్ లు జాతీయ జెండాను ఎగురవేసిన చిత్రాలను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారి వారి అభిప్రాయాలను పంచుకున్నారు.