యూఎస్ఎఐడీ నిధులు.. ట్రంప్ వ్యాఖ్యలు ఆందోళనకరం
విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: యూఎస్ఎఐడీ నిధులు అందాయన్న ట్రంప్ వ్యాఖ్యలపై శుక్రవారం భారతదేశ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జై స్వాల్ స్పందించారు. ఈ విషయం ఆందోళనకలిగిస్తుందన్నారు. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారని, పూర్తి ఆధారాల తరువాతే మిగతా విషయాలను వెల్లడిస్తామన్నారు. ఇలాంటి విషయాల్లో అమెరికా బహిరంగ వ్యాఖ్యల వల్ల తమ దర్యాప్తులో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని, నిధులు అందుకున్న వారు అలర్ట్ అవుతారని అన్నారు. 21 మిలియన్ డాలర్లు యూఎస్ ఎఐడీ ద్వారా ఎలా అందిందన్న దానిపై ఆరా తీస్తున్నట్లు జైస్వాల్ చెప్పారు.