మూడో ప్రపంచయుద్ధం జరగనీయం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: బైడెన్ పరిపాలన కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా జరిగి ఉండేదని, కానీ తన అధికారంలో అలాంటిది జరగనీయబోనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. మయామిలో జరిగిన ఎఫ్ ఐఐ ప్రియారిటీ సమ్మిట్ లో ట్రంప్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం వల్ల ఎవరికీ లాభం లేదన్నారు. యుద్ధాలు ఎన్నటికీ అనర్థదాయకమేనన్నారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల్లో తమ ప్రమేయం లేకున్నా వాటిని ఆపివేస్తానని హామీ ఇచ్చారు. యుద్ధం చేయాలని తాము తలిస్తే ఎవ్వరూ తమ సరిరారన్నారు. కానీ అది ఎప్పటికీ జరగకూడదనే కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు. ఈ యుద్ధాల్లో ఎంతోమంది తల్లిదండ్రులు, కుమారులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలన్నారు. తాము నమ్మిన యుద్ధంలో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టలేమన్నారు. జెలెన్స్కీ నియంతలా ప్రవర్తించడం మానుకోవాలన్నారు.