మోదీ అన్నయ్య, గురువు భూటాన్​ ప్రధాని షెరింగ్​

Prime Minister Tshering of Bhutan is Modi's elder brother and mentor

Feb 22, 2025 - 19:04
 0
మోదీ అన్నయ్య, గురువు భూటాన్​ ప్రధాని షెరింగ్​

ముగిసిన రెండు రోజుల పర్యటన

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు అన్నయ్య, గురువు అని భూటాన్​ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే అన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో ఉన్న షెరింగ్​ శనివారంతో పర్యటన ముగిసింది. రెండో రోజు జరిగిన స్కూల్​ ఆఫ్​ అల్టిమేట్​ లీడర్​ షిప్​ (సోల్​) కాన్​ క్లేవ్​ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ, షెరింగ్​ ల మధ్య సహకారానికి సంబంధించిన కీలక రంగాలపై చర్చలు జరిగాయి. అనంతరం కాన్​ క్లేవ్​ లో ప్రధాని మోదీ ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రజా సేవకుడిగా, ఆయన కష్టపడే విధానం తనకు ప్రేరణనిస్తుందన్నారు. మోదీని చూసిన ప్రతీసారి తనలో నూతనోత్సాహం ఉప్పొంగుతుందన్నారు. తన జన్మదినాన్ని భారత్​ లో జరుపుకోవడం అత్యంత సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇరుదేశాల మధ్య స్నేహం, సహకారం, నమ్మకం, పరస్పర గౌరవాలపై ఆధారపడి ఉందన్నారు. ఇరుదేశాల మధ్య బంధాలు, ఉన్నత స్థాయి చర్చలు అభివృద్ధికి రాచమార్గాలను తెరుస్తాయన్నారు. 

ఈ సమావేశంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్​ణవ్​, మంత్రి కిరన్​ రిజిజు, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా సహా పలువురు సీనియర్​ అధికారులు పాల్గొన్నారు.