పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి ప్రవేశ్ వర్మ
Minister Pravesh Verma inspected the progress of the works

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి, బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రవేశ్ వర్మ రంగంలోకి దిగారు. శనివారం ఢిల్లీలోని బారాపుల్లా ఫేజ్ 3 పనుల పురోగతిని ఎల్ అండ్ టీ అధికారులతో కలిసి ప్రవేశ్ వర్మ పరిశీలించారు. కార్మికులు, కాంట్రాక్టర్లతో కలిసి ముచ్చటించారు. ప్రాజెక్టు నిర్మాణ తీరును గురించి ప్రతీదీ కార్మికులను అడిగి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. మంత్రి స్వయంగా తమ వద్దకు వచ్చి బాగోగులు తెలుసుకున్నందుకు కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. బారాపుల్లా ఫేజ్ 3 సారాయ్ కాలేఖాన్ నుంచి మయూర్ విహార్ వరకు వంతెన నిర్మాణ పనులు ఆర్థిక, ఇతర సమస్యల కారణంగా పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులతో వివరాలను తీసుకున్నారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇకముందు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని చెప్పారు. ఢిల్లీ ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు, మౌలిక సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. మోదీ కలలను సాకారం చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. అందరి సహకారంతో సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రవేశ్ వర్మ స్పష్టం చేశారు.