మోదీ ఓటమికి బైడెన్​ ప్రయత్నం

Biden's attempt to defeat Modi

Feb 22, 2025 - 18:20
 0
మోదీ ఓటమికి బైడెన్​ ప్రయత్నం

డోనాల్డ్​ ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు
త్వరలో అందిన వారి వివరాలు, చిత్రాలు ప్రచురితం అవుతాయి

వాషింగ్టన్​: భారత ప్రధాని మోదీని ఎన్నికల్లో ఓటిమి పాలు చేయాలని జో బైడెన్​ ప్రభుత్వం ప్రయత్నించిందని ట్రంప్​ మరోమారు తీవ్ర విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. వాషింగ్టన్​ డీసీలో జరిగిన రిపబ్లికన్​ రాష్ర్ట గవర్నర్ల సమావేశంలో డోనాల్డ్​ ట్రంప్​ ఈ వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. రూ. 182 కోట్ల నిధులు క్విక్​ బ్యాక్​ ద్వారా డబ్బులు చేతులు మారాయన్నారు. ఈ డబ్బు భారత ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు వినియోగించారన్నారు. అమెరికా నుంచి అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులకు రూ. 250 కోట్లు వచ్చాయన్నారు. అందిన వారి చిత్రాలు కూడా త్వరలో ప్రచురితం అవుతాయని మరో సంచలనానికి తెరతీశారు. అమెరికా సొంత సమస్యలు కూడా మనకు తక్కువేం కాదని, అలాంటప్పుడు భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని జో బైడెన్​ ను నిలదీశారు. అంటే బైడెన్​ భారత్​ లో మరొకరు గెలవాలని భావించారని స్పష్టమవుతుందని అన్నారు. భారత ఎన్నికల్లో బైడెన్​ జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. ఈ పూర్తి వ్యవహారానికి సంబంధించిన విషయాలను భారత ప్రభుత్వానికి వెల్లడిస్తామని డోనాల్డ్​ ట్రంప్​ చెప్పారు.