తైవాన్​–చైనా ఉద్రిక్తతలు అమెరికా ఆగ్రహం

షాంగ్రీ–లా డైలాగ్​ లో చైనా చర్యలను ఎండగట్టేందుకు అమెరికా సిద్ధం

May 26, 2024 - 13:44
 0
తైవాన్​–చైనా ఉద్రిక్తతలు అమెరికా ఆగ్రహం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: తైవాన్​ ను చుట్టుముట్టిన చైనా చర్యలపై అమెరికా ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్​ ఆస్టిన్​ సింగపూర్​ రక్షణ శాఖతో మాట్లాడినట్లు తెలుస్తోంది. తైవాన్​ చుట్టూ చైనా నిర్వహిస్తున్న యుద్ధవిన్యాసాలు ఆ దేశ సార్వభౌమత్వానికి పూర్తిగా భంగం వాటిల్లేలా చైనా ప్రయత్నిస్తోందని భావిస్తున్నారు. ఇది కయ్యానికి కాలు దువ్వడమేనని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా కూడా సింగపూర్​ సముద్ర జలాల్లో తమ యుద్ధనౌకలను మోహరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా తైవాన్​ కు అమెరికా పూర్తి మద్ధతు ప్రకటిస్తూ చైనా చర్యలను పలుమార్లు అంతర్జాతీయ వేదికగా ఎండగట్టింది. 

మంత్రి లాయిడ్​ సింగపూర్​ లో వచ్చేవారం జరగనున్న రక్షణ సమావేశంలో పాల్గొననున్నారు. చైనా కౌంటర్​ అడ్మిరల్​ డాంగ్​ జున్​ ను కలవనున్నారు. సింగపూర్​ లో జరిగే ‘షాంగ్రీ–లా డైలాగ్​’ రక్షణ సదస్సులో అమెరికా, చైనా, సింగపూర్​, తైవాన్​ లతో పాటు 50 దేశాల రక్షణ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చైనా చర్యలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.