ఢిల్లీకి ఇద్దరు డిప్యూటీ సీఎంలు?
ఆదివారం శాసనసభా పక్ష సమావేశం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ కొత్త ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండేలా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది. ప్రధాని మోదీ ఢిల్లీకి తిరిగి వచ్చాక మరోమారు ఢిల్లీ నాయకులతో భేటీలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి వర్గంపై ఒక నిర్ణయానికి రానున్నారు. పలు సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. పూర్వాంచల్, సిక్కు సమాజం నుంచి డిప్యూటీ సీఎంల ఎంపిక జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక సీఎం రేసులో ప్రధానంగా ప్రవేశ్ వర్మ ముందువరుసలో ఉన్నారు. మహిళా నాయకుల్లో బాన్సూరి స్వరాజ్ పేరు కూడా వినిపిస్తుంది. ఇతర రాష్ర్టాల్లో కూడా ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ డిప్యూటీ సీఎంలను నియమించారు. కాగా బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ఆదివారం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలోనే తుది నిర్ణయం వెలువుడుతుందని భావిస్తున్నారు. ప్రవేశ్ వర్మతోపాటు, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ మంజీందర్ సింగ్ సిర్సా, పవన్ శర్మ, ఆశిష్ సూద్, రేఖ గుప్తా, శిఖారాయ్ వంటి సినీయర్ నాయకులు సీఎం, డిప్యూటీ సీఎంల రేసులో ఉన్నారు. ఇప్పటికే సీఎం రేసులో ఉన్న అభ్యర్థుల పేర్లను అధిష్ఠాన నేతలు తీసుకున్నారు.