ఆప్ ఎమ్మెల్యేకు ఊరట
అరెస్ట్ పై స్టే.. దర్యాప్తునకు సహకరించాలని ఆదేశం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఉపశమనం లభించింది. అరెస్టుపై ఫిబ్రవరి 24 వరకు ఢిల్లీ కోర్టు స్టే విధించింది. జామియా నగర్‌లో జరిగిన పోలీసుల దాడి కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ నిందితుడు. గురువారం అరెస్టు పిటిషన్ పై కోర్టు విచారించింది. ఢిల్లీ పోలీసులు ఎమ్మెల్యే ప్రమేయంపై ఆధారాలను ఫిబ్రవరి 24లోపు సమర్పించాలని పోలీసులను, అదే సమయంలో దర్యాప్తునకు పోలీసులతో సహకరించాలని ఎమ్మెల్యేను ఆదేశించింది. అమానతుల్లా ఖాన్ పలుమార్లు నిందితులకు వత్తాసు పలుకుతూ పోలీసులను బెదిరించే వీడియోలు, ఫోటోలు పలు వార్తమాధ్యమాల్లో ప్రసారం అయ్యాయి. ఈ వీడియోల్లో అమానతుల్లా తన ప్రాంతంలోనే తన మనుషులనే అరెస్టు చేసేందుకు వస్తారా? మీకు ఎంత ధైర్యం? వెళ్లకుంటే తీవ్ర పరిణామాలుంటాయని పలుమార్లు హెచ్చరించారు. అంతేగాక హత్యయత్నం కేసులో నిందితుడు పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు కూడా ఈయనే కారణమైనట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.