2030 వరకు రూ. 31 లక్షలకు గ్రీన్ ఇన్వెస్ట్ మెంట్
క్రిసిల్ ఎండీ అమిత్ మెహతా
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మరో ఐదేళ్లలో గ్రీన్ ఇన్వెస్ట్ మెంట్ లో భారత్ ఐదు రెట్లు వృద్ధి రూ. 31 లక్షల కోట్లని చేరుకుంటుందని బుధవారం క్రిసిల్ నివేదిక విడుదల చేసింది. పెట్టుబడుల్లో రూ. 19 లక్షల కోట్లు పునరుత్పాదక ఇంధనం, నిల్వకు రూ. 4.1 లక్షల కోట్లు రవాణా, ఆటోమోటివ్ రంగాల్లోకి, రూ. 3.3 లక్షల కోట్లు చమురు, గ్యాస్‌లోకి వెళుతున్నాయని క్రిసిల్ నివేదిక పేర్కొంది. పారిస్ ఒప్పందం ప్రకారం లక్ష్యాలను చేరుకునేందుకు 2070 నాటికి అవసరమయ్యే 10ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులలో ఇది కీలకం కానుంది. 2005 నుంచి 2030కి పోల్చుకుంటే కార్బన్ ఉద్ఘారాల తగ్గింపును 45 శాతంగా పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. భారత్ అభివృద్ధి ఆర్థికంగా చెందడంతోపాటు పర్యావరణ ఆకాంక్షలను, ప్రాధాన్యతలను కూడా సమతుల్యం చేసుకునే స్థాయికి ఎదుగుతుందని నివేదికలో మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ మెహతా అన్నారు.