మాయావతికి సుప్రీం ఉపశమనం

15ఏళ్ల కేసు విచారణ నిలిపివేత

Jan 15, 2025 - 18:09
 0
మాయావతికి సుప్రీం ఉపశమనం

నా తెలంగాణ, న్యూఢిల్లీ: మాయవతి పుట్టినరోజున సుప్రీంకోర్టు ఆమెకు ఉపశమనం కల్పించింది. 15ఏళ్ల పిటిషన్​ పై విచారణను నిలిపివేసింది.  2009లో రవికాంత్​ అనే న్యాయవాది ప్రజల సొమ్ముతో పార్కుల్లో బీఎస్పీ గుర్తైన ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేయడం సరైంది కాదని, ప్రజాధనం దుర్వినియోగం కిందకు వస్తుందని పిటిషన్​ దాఖలు చేశారు. ఎన్నికల గుర్తును జప్తు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలన్నారు. ఈ కేసును బుధవారం విచారించిన సుప్రీంకోర్టు పాత కేసుగా పరిగణించి విచారణకు ముగింపు పలికింది. 2007 నుంచి 2012 వరకు మాయావతి పాలనలో లక్నో, నోయిడాలో రెండు పెద్ద పార్కులను నిర్మించారు. పాలరాతితో తయారు చేసిన పలు విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులకు కోట్లాది రూపాయలు ఖర్చయింది. ఇందుకోసం అప్పట్లో ప్రతిపక్షాలను కూడా మాయావతి టార్గెట్​ చేశారు.