రూ.2వేల కోట్ల మద్యం కుంభకోణం కాంగ్రెస్ మాజీ మంత్రి లఖ్మా అరెస్ట్
Ex-Congress minister Lakhma arrested in Rs.2 thousand crores liquor scam
రాయ్ పూర్: చత్తీస్ గఢ్ మద్యం కుంభకోణంలో ఈడీ మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసీ లఖ్మాను అరెస్టు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో లఖ్మా మంత్రిగా పనిచేశారు. బుధవారం ఈడీ కార్యాలయంలో ప్రశ్నించిన అనంతరం అరెస్టును ప్రకటించింది. ఈ సందర్భంగా మీడియాతో లఖ్మా మాట్లాడారు. ఈడీ విచారణకు పిలిచిందన్నారు. ఈడీ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతున్నా తనను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఈ విషయంపై సీఎం విష్ణుదేవ్ సాయి మాట్లాడుతూ.. రూ. 2వేల కోట్ల కుంభకోణంపై విచారణ జరుగుతుందని మోసగాళ్లను బీజేపీ ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. విచారణలో అధికారులు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టానని, తాను నిరక్ష్యరాస్యుడినని మంత్రి చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈడీ రెండుసార్లు విచారణ అనంతరం ఈయన పాత్రపై ఆధారాలు లభించడంతోనే అరెస్టు చేసి ఉంటుందన్నారు. అప్పటి భూపేష్ సర్కార్ హయాంలో ఐఏఎస్ అధికారి అనిల్ తుతేజా, ఎక్సైజ్ శాఖ ఎండీ ఏపీ త్రిపాఠి, వ్యాపారవేత్త అన్వర్ ధేబర్ అక్రమ సిండికేట్ ద్వారా ఈ కుంభకోణం జరిగినట్లు ఈడీ తన దర్యాప్తులో తేల్చింది. ఈ కుంభకోణంలో మంత్రి పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించింది.