సేవా స్ఫూర్తితో పనిచేస్తాం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Jan 15, 2025 - 18:34
 0
సేవా స్ఫూర్తితో పనిచేస్తాం

మహారాష్ట్రలో రాధా మదన్​ మోహన్​ ఆలయం ప్రారంభం
ఆధ్యాత్మికతకు నిలయం భారత్​ 
ఇస్కాన్​ కు ఋణపడి ఉంటా
భారత్​ వైఖరిపై ప్రపంచంలో మార్పు

ముంబాయి: కేంద్ర ప్రభుత్వం ప్రతీఒక్కరి పట్ల సేవా స్ఫూర్తితో పనిచేస్తుందని, ఇస్కాన్​ కృషితో రాధా మదన్​ మోహన్​ దేవాలయం ప్రారంభించం తనకు దక్కిన దివ్య అవకాశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం మహారాష్ట్ర ఖార్ఘర్​ లోని ఇస్కాన్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాధా మదన్​ మోహన్​ దేవాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం మహారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే, బీజేపీ ఎంపీ హేమమాలిని తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రధాని ప్రసంగించారు. 

ఆలయ రూపకల్పన, ఆలయ నిర్మాణం వెనుక ఉన్న ఆలోచన ఆధ్యాత్మికత, జ్ఞానం, సంప్రదాయాల మేళి కలయికగా చెప్పారు. ఈ అవకాశాన్ని తనకు అందించినందుకు ఇస్కాన్​ సమాజానికి తాను ఋణపడి ఉంటానన్నారు. నేడు ప్రపంచమంతా ఆధ్యాత్మికత దృష్టి ఇనుమడిస్తుందన్నారు. ఇస్కాన్​ కు చెందిన వారు శ్రీకృష్ణుని సేవలో తరిస్తూ ప్రపంచంతో ముడిపడి ఉన్నారన్నారు. శ్రీకృష్​ణ సూత్రాలు, వేదాలు, గీతల ప్రాముఖ్యత ప్రచారంలో వీరిని మించి లేరన్నారు. సామాన్య ప్రజల చెంతకు భారత సంస్కృతి, సాంప్రదాయాలను చేర్చడంలో వీరి పాత్ర అభినందనీయమన్నారు. 

భారత్​ ప్రపంచంలో సజీవ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు నిలయమన్నారు. భారత్​ ను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆధ్యాత్మికతను గ్రహించాలన్నారు. భౌతిక కోణంలో చూసేవారు భారత్​ ను వివిధ భాషల సమాహారంగా మాత్రమే చూస్తారని, కానీ సమయానుసారం వారిలో మార్పు చోటు చేసుకుంటుందన్నారు. భారత్​ వసుదైక కుటుంబం అనే విశాల దృక్పథంతో ఉందని, అంకిత భావంతో పనిచేస్తుందని మోదీ తెలిపారు. సేవా స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను నిరుపేదలకు దరిచేరుస్తుందని చెప్పారు. గ్యాస్​, నీరు, విద్యుత్​, ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, ఉచిత రేషన్​, ఇళ్లు ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టామన్నారు. తమ ఈ ప్రయత్నాలు నిరంతరం సామాజిక న్యాయాన్ని తీసుకువస్తాయని ప్రధాని మోదీ చెప్పారు.