పాక్​ లో ఉగ్రదాడి ముగ్గురు మృతి, 11మందికి గాయాలు

Three killed, 11 injured in terror attack in Pakistan

Jan 1, 2025 - 16:07
 0
పాక్​ లో ఉగ్రదాడి ముగ్గురు మృతి, 11మందికి గాయాలు

ఇస్లామాబాద్​: పాకిస్థాన్​ లోని ఖైబర్​ ఫఖ్తుంఖ్వా, వజీరిస్థాన్​ లో ఉగ్రవాదులు జరిగిపిన వేర్వేరు దాడుల్లో ఒక చిన్నారి సహా ముగ్గురు మరణించారు. 11మందికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం దర్బన్​ ప్రాంతంలోని పోలీస్​ పోస్ట్​ పై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. వజీరిస్థాన్​ లోని అజామ్​ వార్సాక్​ ప్రాంతంలో మోటారు సైకిల్​ లో అమర్చిన బాంబును పేల్చారు. ఈ ఘటనలో ఒక చిన్నారి మృతి చెందాడు. పలువురికి గాయాలయ్యాయి. 2024లో 270 మంది ఉగ్రవాదులను హతమార్చగా, 820మందిని అరెస్టు చేశారు. ఉగ్రదాడుల్లో 149 మంది పోలీసులు మృతి చెందగా 232 మంది గాయపడ్డారు.