రైతులకు కేంద్రం శుభవార్త
Center is good news for farmers
డీఏపీపై అదనపు సబ్సిడీ
ఫసల్ బీమాతో మరో 4 కోట్ల మంది రైతులకు లబ్ధి
ఇన్నోవేషన్ పరిశోధనలకు రూ. 824.77 కోట్లు కేటాయింపు
కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 50 కిలోల డీఏపీ బస్తాను రూ. 1350కే అందజేయాలని బుధవారం మోదీ అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో నిర్ణయించింది. వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో పంచుకున్నారు. డీఏపీపై రూ. 3850 కోట్ల అదనపు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. పంటల బీమా పథకాన్ని 2025–26లో కొనసాగించేందుకు ఆమోదించారు. ఇందుకోసం రూ. 69,515.71 కోట్లను కేటాయించారు. దీంతో మరో 4 కోట్ల మంది రైతులను ఫసల్ బీమా యోజన కింద లబ్ధి పొందనున్నారు. ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ కోసం ఫండ్ ఏర్పాటుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పథకం కింద సాంకేతిక కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేయడానికి రూ.824.77 కోట్లను కేటాయించారు.