ఉగ్రవాదులకు సహాయం ముగ్గురు సహాయకుల అరెస్ట్
Three helpers arrested for helping terrorists

శ్రీనగర్: బారాముల్లాలో ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ముగ్గురు సహాయకులకు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఏకే–47 సహా భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం పోలీసులు, భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ లో వీరిని అరెస్టు చేశారు. ఏకె–47, ఒక మ్యాగజైన్, 13 రౌండ్ల బుల్లెట్లు, ఒక పిస్టల్, వాహనం, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన గ్రెనేడ్ దాడి కేసులో ఈ ముగ్గురు ఉగ్రవాదులకు సహకరించినట్లు గుర్తించామని బారాముల్లా ఎస్పీ ఫిరోజ్ యాహ్వా అన్నారు. 163 టీఏ ఆవరణలో దాడికి పాల్పడ్డారన్నారు. అదృష్టవశాత్తు దాడిలో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం వాటిల్లలేదన్నారు. ఈ దాడిపై యూఏపీఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన తెలిపారు. దర్యాప్తులు ఈ ముగ్గురి హస్తం ఉన్నట్లు తేలిందన్నారు. దర్యాప్తు బృందాల పనితీరును ఎస్పీ అభినందించారు.