అదానీ, ఇస్కాన్ రోజుకు 50 లక్షల మందికి ఉచిత అన్నదానం
కుంభమేళా హారతి కోటి కాపీల పంపిణీ

లక్నో: కుంభమేళాలో అదానీ, ఇస్కాన్ సంస్థలు భారీ సహాయానికి ముందుకు వచ్చాయి. రోజుకు 50 లక్షల మందికి ఉచిత అన్నదానం (ప్రసాద వితరణ) చేయాలని నిర్ణయించాయి. ఇందుకు అయ్యే ఖర్చును అదానీ సంస్థ భరించనుంది. ప్రయాగ్ రాజ్ కు కొద్ది దూరంలో రెండు భారీ వంటశాలలను ఇస్కాన్ ఏర్పాటు చేసింది. 2500మంది వలంటీర్ల ద్వారా ఆహారాన్ని వండనున్నారు. ఇక్కడి నుంచి పలు వాహనాలలో జాతర జరిగే 40 ప్రాంతాలలో ప్రసాద వితరణకు ఏర్పాటు చేశామని తెలిపారు. దీంతోపాటు మహాకుంభ మేళాకు సంబంధించిన హారతి విశేషాలతో కూడిన కోటి బుక్ లెట్ లను కూడా ఉచితంగా అందజేయనున్నారు. ఈ జాతరకు 40 కోట్ల మంది హాజరుకానున్నారని అంచనా వేస్తున్నారు.