తాజ్ హిందూ దేవాలయమే! బీజేపీ నేత సంగీత్ సోమ్
Taj is a Hindu temple! BJP leader Sangeet Som

లక్నో: తాజ్ మహల్ హిందూ దేవాలయంగా ఉండేదని, హిందూ దేవాలయంగానే కొనసాగాలని బీజేపీ నేత సంగీత్ సోమ్ డిమాండ్ చేశారు. భారత్ సనాతనులకు మాత్రమే భూమి అన్నారు. శనివారం యూపీలోని ముజఫర్ నగర్ లో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ తొలి వార్షికోత్సవ వేడుకల సందర్భంగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఊరేగింపులో సంగీత్ సోమ్ పాల్గొన్నారు. అసలు ఆ ప్రాంతంలో తాజ్ మహల్ లాంటిదే లేదన్నారు. హిందూ దేవాలయమే ఉండిందన్నారు. నేడు సనాతన పర్వదినాన్ని ప్రతీ హిందువు జరుపుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఏ సమాధిపైనా ఎటువంటి భవనం, శాశ్వత భవనం నిర్మించలేమన్నారు. సనాతన భక్తుల మనోధైర్యాన్ని బీజేపీ పెంచిందన్నారు. ఆక్రమణదారులు దేశంలో మందిరాలపై మసీదులు నిర్మించారని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు ఉగ్రవాదులు, గూండాల సంస్థగా అభివర్ణించారు. వక్ఫ్ భూమి కేవలం పాక్ లో మాత్రమే ఉందన్నారు. అక్రమ మదర్సాలపై చర్యలు తీసుకోవాలని సంగీత్ సోమ్ డిమాండ్ చేశారు.