ట్రాక్​ పేల్చివేత కుట్ర భగ్నం

The track blasting plot was foiled

Dec 31, 2024 - 16:38
 0
ట్రాక్​ పేల్చివేత కుట్ర భగ్నం

పూణె: పూణె ఉరులి కంచన్​ రైల్వే ట్రాక్​ ను పేల్చివేసేందుకు గుర్తుతెలియని దుండగులు కుట్ర పన్నారు. ఇందులో భాగంగా ట్రాక్​ పై గ్యాస్​ తో నిండి ఉన్న సిలిండర్​ ను ట్రాక్​ పై పెట్టారు. లోకోపైలెట్​ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ముప్పు తప్పింది. దీంతో లోకో పైలెట్​ ఆర్పీఎఫ్​, ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లోకో పైలెట్​ తనిఖీల్లో భాగంగా అర్థరాత్రి గ్యాస్​ సిలిండర్​ ను రైల్వే పట్టాలపై గుర్తించారు. వెంటనే ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా ఈ ఘటన ఆదివారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. 150, 152 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.